తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
రిపోర్టర్: నరేష్
స్థలం: Amaravati
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను తీవ్రరూపం దాల్చుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే గంటల్ లో ఇది మరింత బలపడి నెల్లూరు - నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్ లో రానున్న మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండి హెచ్చరించింది.