రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభం: ముచ్చింతల్, రామాంజపూర్లో ముమ్మరంగా పనులు

రిపోర్టర్: saikiran స్థలం: రాజేంద్రనగర్

రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం ముచ్చింతల్, రామాంజపూర్ మరియు నానాజీపూర్ గ్రామాల్లో ఎంపీ లాడ్స్ నిధులు నూట నలభై ఐదు లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్ రెడ్డితో పాటు సర్పంచులు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.