వైఎస్సార్సీపీ మద్యం కుంభకోణానికి జగనే కర్త కర్మ క్రియ అంటూ మంత్రి పార్థసారథి ఆగ్రహం

రిపోర్టర్: రాము స్థలం: ఆంధ్రప్రదేశ్

సంపూర్ణ మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ భారీ మద్యం కుంభకోణానికి పాల్పడిందని, దీనికి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డే కర్త, కర్మ, క్రియ అని మంత్రి పార్థసారథి తీవ్రంగా మండిపడ్డారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లను నిరాకరించి సుమారు రూ.4 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మెగా డీఎస్సీ భర్తీపై వైఎస్సార్సీపీ, సాక్షి పత్రిక అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.