ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవచ్చు
రిపోర్టర్: కిరణ్
స్థలం: విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి పౌరుడు నూతన మద్యం దుకాణ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అక్టోబరు 5వ తేదీన లాటరీ పద్ధతి ద్వారా అర్హులకు పారదర్శకంగా షాపులు కేటాయిస్తామని వెల్లడించారు. మద్యం నాణ్యత పర్యవేక్షణ కోసం ఎక్సైజ్ సురక్షా యాప్ను అందుబాటులోకి తెచ్చామని, గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పూర్తిగా అవినీతిమయంగా మారిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.