విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం: కలెక్టర్

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి పురపాలిక, నెల్లిమర్ల నగర పంచాయతీలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది. రాజీవ్ స్టేడియం వద్ద ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, సున్నిత కేంద్రాల్ లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఓటర్లంతా ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.