భారతదేశంలో సెప్టెంబర్ 25న అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎంకోర్ రీ రిలీజ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

సంచలన విజయం సాధించిన మార్వెల్ సినిమా అవెంజర్స్ ఎండ్‌గేమ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎంకోర్ పేరిట సెప్టెంబర్ 25, 2026న భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. డిసెంబర్ 18న విడుదల కానున్న అవెంజర్స్ డూమ్స్‌డే చిత్రానికి సంబంధించిన ప్రత్యేక ప్రివ్యూ సీన్స్‌ను ఈ రీ రిలీజ్‌లో జోడించనున్నట్లు మార్వెల్ స్టూడియోస్ ప్రకటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.