విజయవాడలో వైసీపీ నిరసన ర్యాలీకి పోలీసులు బ్రేక్

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయవాడ

విజయవాడలో ఈ నెల 21న వైసీపీ తలపెట్టిన భారీ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. డీఎస్పీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ చేపట్టిన ఈ ఆందోళనకు ఎలాంటి పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌కు మాచవరం పోలీసులు ముందస్తు నోటీసులు అందజేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడంతో విజయవాడలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.