ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో మరోసారి కస్టడీకి నిందితుడు
రిపోర్టర్: అశోక్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య మరియు జగదీశ్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ ను మరోసారి విచారించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. నిందితుడి కస్టడీ కోసం సర్పవరం పోలీసులు కాకినాడ మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. సాదిక్ వేధింపులు, మతమార్పిడి ఒత్తిళ్ల వల్లే నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు తేలింది.