ఆమనగల్లో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ డ్రైవ్స్
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఓటర్ల జాబితా సవరణ SIR ప్రక్రియలో భాగంగా ప్రత్యేక క్యాంపెయిన్ డ్రైవ్స్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్లలోని బిఎల్ఓలను సంప్రదించి ఫారం 6, 7, 8లపై పూర్తి సమాచారం పొందాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన హియరింగ్లో నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి పత్రాలు స్వీకరించారు.