టెక్నికల్ సమస్యతో నిలిచిన ఎరువుల విక్రయాలు, ఇబ్బందుల్లో రైతులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీబీటీ యాప్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా పలు జిల్లాల్లో ఎరువుల విక్రయాలు నిలిచిపోయాయి. సర్వర్ లోపాల వల్ల ఈపీఓఎస్ యంత్రాలు పనిచేయకపోవడంతో యూరియా, డీఏపీ కోసం దుకాణాలకు వెళ్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓటీపీలు రాకపోవడంతో డీలర్లు అమ్మకాలు జరపడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఈ సమస్య మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.