కొండా సురేఖ తొలగింపుతో కాంగ్రెస్‌లో మొదలైన అంతర్గత అసంతృప్తి సెగలు
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంతో కాంగ్రెస్‌లో బీసీ కార్డు రాజకీయాలు బూమరాంగ్‌గా మారాయి. గద్వాల విజయలక్ష్మి, నేరెళ్ల శారద, గుండు సుధారాణిలకు పదవులు కట్టబెట్టడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీనియర్లను కాదని, వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై హస్తం పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. సురేఖ లోటును భర్తీ చేయడంలో అధిష్టానం విఫలమైందనే చర్చ జోరుగా సాగుతోంది.