ఉత్తమ్ వ్యాఖ్యలు మూర్ఖత్వానికి పరాకాష్ఠ అంటూ జగదీశ్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

దానం నాగేందర్ విషయంలో న్యాయం గెలిచిందని, ఇది ప్రజాస్వామ్య విజయమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన రీతిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం ఆయన మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని తీవ్రంగా విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీలకు పైగా నీటిని తరలిపోతుంటే కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. న్యాయవ్యవస్థపై నమ్మకంతోనే ప్రజాస్వామ్యం బతుకుతోందని స్పష్టం చేశారు.