యాదాద్రి జిల్లాలో భీభత్సం: జోగిని దారుణ హత్య, భారీగా బంగారం దోపిడీ
రిపోర్టర్: నరేష్
స్థలం: యాదాద్రి భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో రాళ్లబండి సుధాకర్ స్వామి గురూజీ అనే జోగినిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. మృతుడి కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి కాళ్లు, చేతులు కట్టేసి ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇంట్ లోని డెబ్బై తులాల బంగారంతో పాటు నగదును దోచుకెళ్లి, మృతుడి స్కార్పియో వాహనంలో పరారయ్యారని వెల్లడించారు. జీపీఎస్ ఆధారంగా నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.