టెక్ ప్రియులకు తీపి కబురు: మార్కెట్లోకి భారీ బ్యాటరీతో వివో వై600
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: చైనా
స్మార్ట్ఫోన్ మార్కెట్లో సరికొత్త రికార్డులతో దూసుకుపోయేందుకు ప్రముఖ సంస్థ వివో సిద్ధమవుతోందని కంపెనీ వర్గాలు వెల్లడించారు. పదివేల ఎంఏహెచ్ భారీ బ్యాటరీ మరియు యాభై మెగాపిక్సెల్ కెమెరా ప్రత్యేకతలతో వివో వై600 ఫోన్ను అక్టోబర్ ముప్పైవ తేదీన చైనా మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుదీర్ఘకాలం పనిచేసే ఈ అత్యాధునిక ఫోన్ లాంచ్ కోసం టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వారు తెలిపారు.