ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతలపై బాధితుల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Khammam
ఖమ్మం శ్రీనివాసనగర్‌లో పేదల ఇళ్లను కూల్చివేస్తామంటూ మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టెల కంపెనీ వద్ద డబ్బులు తీసుకుని అధికారులు తమను ఖాళీ చేయిస్తున్నారని బాధితులు ఆరోపించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ తమకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న వెలుగుమట్ల, నేడు తమ ఇళ్లపై పడ్డారని బాధితులు వాపోయారు.