మీరట్ లో దారుణం: వేరే పెళ్లి చేసుకుంటుందన్న కక్షతో యువతి హత్య

రిపోర్టర్: కృష్ణ స్థలం: మీరట్

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ప్రేమించిన యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటోందన్న కక్షతో ఫిరోజ్ అనే యువకుడు ఆమెను గొంతు నులిమి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సేమరీన్ అనే యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిందితుడు, ఆమెకు వేరే వివాహం నిశ్చయమవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. చివరిసారిగా మాట్లాడాలని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.