ఛాంపియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా సాయిరాం గోల్డ్ విన్నర్స్
రిపోర్టర్: I am Farmer 🍅🌱
స్థలం: అచ్యుతాపురం
అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీలో కేర్ అండ్ క్యూర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఛాంపియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-1లో సాయిరాం గోల్డ్ విన్నర్స్ జట్టు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిపై 65 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఈ పోటీల్లో అశోక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి ఆకట్టుకున్నాడు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ టోర్నీ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సునీల్, రాజాన విజయ్‌కుమార్, బైలపూడి శ్రీరాందాస్ తదితరులు పాల్గొన్నారు.