గుండెపోటుతో కన్నుమూసిన సీనియర్ జర్నలిస్టు వడ్డూరి శ్రీనివాసరావు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
తెలంగాణలోని ఖమ్మం ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు వడ్డూరి శ్రీనివాసరావు గుండెపోటుతో అర్ధరాత్రి మృతి చెందారు. గత నాలుగు దశాబ్దాలుగా పలు ప్రముఖ పత్రికల్లో సబ్ఎడిటర్గా ఆయన సేవలు అందించారు. నాగోల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.