డైపర్ల డెలివరీలో నిర్లక్ష్యం: ఎక్స్‌ప్రెస్‌బీస్‌కు జరిమానా

రిపోర్టర్: విజయ్ స్థలం: Kerala

కేరళలో వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు వెలువరించింది. డైపర్ల పార్సిల్ డెలివరీ చేయడంలో విఫలమైన ఎక్స్‌ప్రెస్‌బీస్ కొరియర్ సంస్థకు రూ.15 వేల పరిహారం, రూ.7,500 వ్యాజ్యం ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. ఆర్డర్ రద్దు చేసినా, తప్పుడు సమాచారం ఇవ్వడంతో వినియోగదారుడు తీవ్ర ఇబ్బంది పడ్డాడని, సేవల్లో లోపం స్పష్టంగా ఉందని కమిషన్ స్పష్టం చేసింది.