కవిత సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన నాగోబా చైర్మన్
రిపోర్టర్: అశోక్
స్థలం: आదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కేస్లాపూర్ నాగోబా దేవాలయ కమిటీ చైర్మన్ మేస్రం ఆనందరావు తన అనుచరులతో కలిసి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత సమక్షంలో పార్టీలో చేరారు. బంజారాహిల్స్ కార్యకర్తల సమావేశంలో పలువురు సర్పంచ్‌లు కండువా కప్పుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కవిత ఏర్పాట్లు చేస్తున్నారు.