తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఇరవై మండలాలకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Amaravati

బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం తీవ్ర తుఫానుగా మారుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాపట్ల సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నవంబర్ రెండు, మూడు తేదీల్ లో కోస్తా జిల్లాల్ లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.