నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రజావాణి: ఎస్పీ కార్యాలయంలో అందిన పద్నాలుగు ఫిర్యాదులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: నాగర్ కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారుల నుండి మొత్తం పద్నాలుగు ఫిర్యాదులను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్ స్వీకరించినట్లు ఎస్పీ నాగర్ కర్నూల్ వెల్లడించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల సమస్యలను స్వయంగా ఆలకించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించడం జరిగిందని స్పష్టం చేశారు.