తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి

రిపోర్టర్: రాజేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని శ్రీ మలయప్పస్వామివారిని దర్శించుకున్నారు. హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో భక్తులకు అభయమిచ్చిన స్వామివారిని వారు భక్తిశ్రద్ధలతో సేవించుకున్నారు.