అంతరిక్షం నుంచి ఓటు వేసిన భారత సంతతి ఆస్ట్రోనాట్ అనిల్ మీనన్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూయార్క్

అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ అనిల్ మీనన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. భూమికి సుమారు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో మైక్రో గ్రావిటీలో ఉన్న ల్యాప్ టాప్ ద్వారా ఎలక్ట్రానిక్ బ్యాలెట్ రూపంలో ఓటు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. స్పేస్ స్టేషన్ నుంచి ముగ్గురు వ్యోమగాములు ఓటు వేశామని, ఆ డిజిటల్ ఓట్లు నాసా కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా భూమికి చేరాయని ఆయన స్పష్టం చేశారు.