బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి: శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బేబీ నాయన

రిపోర్టర్: GANESH BBL స్థలం: తెర్లాం

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి వీబీ-గ్రామ్ జీ పథకం కింద రూ.12.5 కోట్లు మంజూరయ్యాయి. బుధవారం బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీ నాయన), బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు కూటమి నేతలతో కలిసి బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. కారాడ-జనార్ధనవలస, అంట్లవార, పి.వెంకంపేట, ఏజీపేట, డొంకినవలసలలో పనులను ప్రారంభించి, గ్రామీణ రహదారులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే రంగారావు స్పష్టం చేశారు.