దమ్మాయిగూడలో నిలిచిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు: కలెక్టర్ కు కాంగ్రెస్ నేత వినతి

రిపోర్టర్: సతీష్ స్థలం: మేడ్చల్

చట్టబద్ధమైన పత్రాలున్నప్పటికీ దమ్మాయిగూడ ప్రాంతంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంపై దమ్మాయిగూడ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పా రామారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ పద్మశాలి సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.