వైద్యుడి నిర్లక్ష్యంతో ఇంజెక్షన్ వికటించి ఎనిమిదేళ్ల బాలిక దుర్మరణం
రిపోర్టర్: సునీల్
స్థలం: Maharashtra
మహారాష్ట్రలోని వసాయ్ ప్రాంతంలో అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తున్న నకిలీ వైద్యుడు ధూప్చంద్ నిషాద్ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి మరియం మొహమ్మద్ అన్సారీ అనే ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందినట్లు వాలివ్ పోలీసులు తెలిపారు. వాంతులవుతున్నాయంటూ సోమవారం రాత్రి క్లినిక్కు వెళ్లిన బాలికకు ఎలాంటి అర్హత లేకపోయినా అలోపతి ఇంజెక్షన్లు ఇవ్వడంతో మరుసటి రోజు ఉదయం ఆమె ముక్కు, నోటి నుంచి రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యాధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.