నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా చేనేత పింఛన్ల దరఖాస్తులకి అడ్డదారులు

రిపోర్టర్: రమేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల మంజూరుకు సంబంధించి 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికుల నుంచి కొత్త దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగియనుంది. అయితే అర్హత లేనివారు సైతం పింఛన్లు పొందేందుకు అడ్డదారుల్లో ప్రయత్నిస్తుండగా సచివాలయ ఉద్యోగులు, రాజకీయ నాయకులు దీనిని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా నెల్లూరు రూరల్, కోవూరు, సంగం, వింజమూరు, పొదలకూరు, వెంకటాచలం, బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లో చేనేత జనాభా అధికంగా ఉండటంతో నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తులు వస్తున్నాయి.