పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో సాధారణ ఎన్నికల కోసం 67 పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో సాధారణ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు గాను మొత్తం 67 పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.