సీక్రెట్ సోల్జర్ సినిమా టైటిల్ వెనుక ఆసక్తికర కథ ఉందన్న అక్కి విశ్వనాథ్ రెడ్డి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై డ్రామా సీక్రెట్ సోల్జర్ సినిమా నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు అక్కి విశ్వనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మొదట ఈ చిత్రానికి చైనా పీస్ అనుకున్నప్పటికీ, గల్వాన్ యుద్ధం నేపథ్యంలో రాజకీయ రంగు పులుముకోవడంతో సీక్రెట్ సోల్జర్ టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపారు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఆసక్తికరమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఆయన వెల్లడించారు.