గుంటూరులో చీకటి గోపి అనుమానాస్పద మృతిపై సిట్ దర్యాప్తు

రిపోర్టర్: రాము స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లా తాడికొండ పోలీసుస్టేషన్ పరిధిలో చీకటి గోపి అనుమానాస్పద మృతిపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ సిట్ ఇన్‌ఛార్జిగా ఏఎస్పీ రవికుమార్, సభ్యులుగా సౌత్ డీఎస్పీ పూర్ణచంద్రరావు, పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య, అరండల్‌పేట ఎస్సై అశోక్‌లను నియమించినట్లు ఆయన స్పష్టం చేశారు.