తరగతి గదిలో విద్యార్థినిపై గొడ్డలితో దాడి: అనంతపురంలో భయానక ఘటన కలకలం

రిపోర్టర్: రాజేష్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థినిపై దుండగుడు గొడ్డలితో దాడికి పాల్పడినట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ దారుణ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆయన ఆదేశించారు. పాఠశాల గదిలో ఇలాంటి అరాచక హింస చోటుచేసుకోవడం పట్ల సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.