మహిళలకు ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్న ప్రభుత్వం

రిపోర్టర్: మహేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అందిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం మరింత విస్తరిస్తోంది. రద్దీని తగ్గించేందుకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు త్వరలో ఏసీ బస్సుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాబోయే దసరా పండుగ నుంచి ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద 87 కోట్ల ప్రయాణాలు పూర్తయ్యాయి.