స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు

రిపోర్టర్: అశోక్ స్థలం: కడప

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రంలో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లిలో అమరజీవి జలధార రెండవ విడత పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం జల జీవన్ మిషన్ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రూ.30,156 కోట్లతో ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.