పలాసలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. మూడు వాహనాల సీజ్

రిపోర్టర్: Dinesh panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ రామకృష్ణ, ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో అపరిచిత వ్యక్తుల నివాసాలు, గుర్తింపు కార్డుల వివరాలపై అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.