లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఎస్‌ఈడీసీఎల్ టెక్నీషియన్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నవీ ముంబై

మహారాష్ట్రలోని నవీముంబైలో విద్యుత్ మీటర్ పునరుద్ధరణ కోసం రూ. 18 వేలు లంచం డిమాండ్ చేసిన ఎంఎస్‌ఈడీసీఎల్ సీనియర్ టెక్నీషియన్ రమేశ్వర్ నివృత్తి ఘన్‌మోడేను నవీముంబై యాంటీ కరెప్షన్ బ్యూరో అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. ఉరాన్ ప్రాంతంలో వీబ్రిడ్జ్ యజమాని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.