కోల్‌కతాలో దారుణం, ఆస్తి వివాదంతో మంచానికే పరిమితమైన తమ్ముడిని హత్య చేసిన అన్న
రిపోర్టర్: విజయ్
స్థలం: Kolkata
కోల్‌కతాలోని బాగ్‌పాటి ప్రాంతంలో దారుణం జరిగింది. 2017 నుంచి అనారోగ్యంతో మంచానికే పరిమితమైన 28 ఏళ్ల బలరామ్ రాజ్‌బంశీని ఆస్తి వివాదం కారణంగా ఆయన సొంత అన్న కృష్ణ రాజ్‌బంశీ హత్య చేశాడు. ఈ హత్యను దోపిడీగా చిత్రీకరించేందుకు నిందితుడు గదిలోని వస్తువులను చిందరవందర చేశాడు. పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన తల్లి గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.