కరెంట్ ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారంటూ సర్కార్‌పై ఫైర్

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, కనీసం నాలుగు గంటలు కూడా కరెంట్ ఇవ్వకుండా రైతులను దారుణంగా మోసం చేస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ లేక పంటలన్నీ ఎండిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, సబ్ స్టేషన్ల ముందు రైతులు ధర్నాలు చేసే దుస్థితి ఏర్పడిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.