అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైకాపా తప్పుడు ప్రచారం అంటూ అదితి గజపతిరాజు మండిపాటు
రిపోర్టర్: గోపి
స్థలం: విజయనగరం
కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మండిపడ్డారు. విజయనగరం మండలం దుప్పాడలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధిపై వైకాపా నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామాలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలందరి సంక్షేమం కోసం కోట్లాది రూపాయలతో ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.