ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు మరియు లోతట్టు ప్రాంతాలు జలమయం

రిపోర్టర్: సతీష్ స్థలం: తూర్పు గోదావరి

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, రాజమహేంద్రవరం నగరంతో పాటు గోపాలపురంలో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై వరద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా పలు జలపాతాలు, పర్యాటక ప్రాంతాల్లోకి ప్రవేశం నిషేధించారు.