వైద్యుల సంచలన విజయం: బాలిక చిన్న పేగులో ఇరుక్కున్న పిన్ తొలగింపు
రిపోర్టర్: సురేష్
స్థలం: Rajkot
గుజరాత్లోని జునాగఢ్ జిల్లాకు చెందిన పన్నండేళ్ల బాలిక ప్రమాదవశాత్తు మెటల్ పిన్ను మింగేయడంతో తీవ్ర కడుపునొప్పికి గురైందని ఎయిమ్స్ రాజ్ కోట్ వైద్యులు తెలిపారు. చిన్న పేగులో ఇరుక్కుపోయిన ఆ పదునైన పిన్ను ఎండోస్కోపీ ద్వారా ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా విజయవంతంగా తొలగించినట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. పిల్లలు తెలియకుండా ప్రమాదకర వస్తువులు మింగేస్తే వెంటనే అప్రమత్తమై తగిన వైద్య సహాయం తీసుకోవాలని తల్లిదండ్రులకు వైద్యులు హెచ్చరికలు జారీ చేశారు.