ఘనంగా వాల్మీకి జయంతి: చిత్రపటానికి నివాళులర్పించిన పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు

రిపోర్టర్: సతీష్ స్థలం: ఎన్టీఆర్

వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ గారు జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శా ఐఏఎస్ గారితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినట్లు Vijayawada City Police వెల్లడించారు. ఈ సందర్భంగా రామాయణం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ధర్మం, కుటుంబ విలువలు మరియు మానవతా విలువలను జీవితంలో పెంపొందించుకోవాలని పోలీస్ కమిషనర్ గారు ప్రత్యేకంగా సూచించారు.