తుఫాన్ ముప్పు: లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా పోలీసులు

రిపోర్టర్: సురేష్ స్థలం: శ్రీకాకుళం

తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను జిల్లా పోలీసులు అప్రమత్తం చేస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం వెల్లడించింది. వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా కటాఫ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రత కోసం అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహాలపై నిరంతరం నిఘా ఉంచామని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.