అమిత్ షా సభతో ఒరిగేదేమీ లేదంటూ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Hyderabad

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ సభతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. కేంద్రం ఇచ్చిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సోమవారం ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీలను గాలికొదిలేసి, మతం రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.