అమెరికా మీడియా సంస్థలపై నిషేధం విధించిన డొనాల్డ్ ట్రంప్

రిపోర్టర్: సతీష్ స్థలం: అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకుంటూ వైట్‌హౌస్‌లోకి సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌నౌ, పొలిటికో వార్తా సంస్థల ప్రవేశంపై నిషేధం విధించారు. తనపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేసిన ఆయన, భవిష్యత్తులోనూ ఇలాంటి సంస్థలపై వేటు తప్పదని హెచ్చరించారు. మరోవైపు గ్రీన్‌లాండ్‌ భద్రతపై డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌లతో శాశ్వత ఒప్పందం కుదిరిందని, త్వరలోనే అక్కడ భారీ సైనిక స్థావరం ఏర్పాటు చేస్తామని ట్రూత్‌ సోషల్‌ ద్వారా ట్రంప్ ప్రకటించారు.