ది ప్యారడైజ్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ది ప్యారడైజ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. నాని మాస్ యాక్షన్ నటనతో పాటు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయని నెటిజన్లు, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.