కొల్కులపల్లి అయ్యప్ప ఆలయ నిర్మాణానికి బట్టు దంపతుల భారీ విరాళం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మాడ్గుల
మాడ్గుల మండలం కొల్కులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణ నిమిత్తం బట్టు రామేశ్వరమ్మ మరియు శ్రీనివాస్ రెడ్డి దంపతులు రూ.1,11,111 భారీ విరాళాన్ని మంగళవారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించేందుకు తమ వంతు సహాయ సహకారాలు నిరంతరం అందిస్తామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు.