భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సరుబుజ్జిలి
సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో వినాయక చవితి పండగ ఘనంగా ప్రారంభమైంది. గ్రామంలోని యువత అంతా కలిసికట్టుగా ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవ మూర్తులను సోమవారం భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు. ముఖ్యంగా గ్రామంలో ఏర్పాటు చేసిన అయోధ్య వినాయకుడు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలతో పురుషోత్తపురం గ్రామం మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.