ఓటు హక్కు వినియోగంపై అవగాహన: యువత స్వచ్ఛంగా ముందుకు రావాలని పిలుపు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: రౌతులపూడి

ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని రౌతులపూడి ఏఎస్సై రెడ్డి వెంకట అప్పారావు పిలుపునిచ్చారు. రౌతులపూడి శ్రీ సూర్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని, ఓటే అత్యంత శక్తిమంతమైన ఆయుధమని స్పష్టం చేశారు. పద్దెనిమిది ఏళ్లు నిండిన యువతీ యువకులు వెంటనే ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.