పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత: ఓటు వేయకుండానే వెనుదిరిగిన వైఎస్ జగన్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: పులివెందుల

పులివెందులలో ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుదిరిగారు. ఏజెంట్లను అడ్డుకుంటూ రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ అరాచకాలపై ఆర్వో కార్యాలయం ఎదుట ఏజెంట్లతో కలిసి ఆయన ధర్నా నిర్వహించి, పులివెందులలో తక్షణమే రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.